కామారెడ్డి జిల్లా వైద్యశాఖ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు వైద్యుల మధ్య సఖ్యత లోపం, అధికారుల ఉదాసీనత ప్రక్షాళనకు అడ్డుగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్య శాఖలో పోస్టులలో అవినీతికి ఆజ్యం పోశారన్న ఆరోపణలు గతంలో గట్టిగా వినిపించాయి. మరోవైపు మహిళ వైద్యాధికారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై కామారెడ్డి DMHO లక్ష్మణ్ సింగ్ పై ఉన్నతాధికారులు వేటు వేశారు. లక్ష్మణ్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వారం రోజుల క్రితం కామారెడ్డి DMHO లక్ష్మణ్ సింగ్, సూపరిండెంట్ పై రాష్ట్ర ఉన్నత అధికారులు విచారణ చేపట్టి… తాజాగా ఆయనను సస్పెండ్ చేశారు.
Discussion about this post