ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో రోజు వందలాది మంది రోగులు చికిత్స నిమిత్తం జిల్లా నలుమూల నుంచి వస్తుంటారు.హాస్పిటల్ లో మాత శిశు సంరక్షణ,అత్యవసర చికిత్స విభాగాలలో ఏసీలు, ఫ్యాన్లు రిపేర్ కు గురి కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రోగులు, వారి కుటుంబ సభ్యులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రోగులు తమ ఇంటి నుంచి టేబుల్ ఫ్యాన్లను తీసుకొని వచ్చి ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు హాస్పిటల్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వాటర్ సప్లై సరిగ్గా కాకపోవడంతో బాత్రూంలోకి వెళ్లేందుకు రోగులు, రోగుల కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురౌవుతున్నారు. వెంటనే పాడైపోయిన ఏసీలను, ఫ్యాన్లను మరమ్మత్తులు చేసి బిగించాలంటూ రోగులు, రోగుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Discussion about this post