కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కంగువా’. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. యానిమల్ నటుడు బాబీ డియోల్ మరోసారి విలన్ గా కనిపించనున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాబీ డియోల్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా.. అతడి గ్యాంగ్ నుంచి అమాయక ప్రజలను రక్షించేందుకు సూర్య ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా సాగుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తున్నాడు.
కంగువ రెండు పార్టులుగా రాబోతుండగా.. కంగువ పార్టు 1 ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే లాంచ్ చేసిన కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో, పోస్టర్లు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.
Discussion about this post