వైసీపీ నేత దౌర్జన్యానికి నిరసనగా పలాస నియోజకవర్గంలోని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు అర్ధరాత్రి ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన వారిపట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళలకు మద్దతుగా వచ్చిన మీడియా ప్రతినిధిని, దళితుడైన స్థానికుడిని ఏఎస్ఐ వెంకట్రావు తోసేశారు. అసభ్య పదజాలంతో తిట్టిపోశారు.
పలాస మున్సిపాలిటీ 29వ వార్డులో కౌన్సిలర్ వేయించిన బోరు నీటి కోసం వెళ్లిన తమపై వైసీపీ నేత చల్ల నారాయణ దౌర్జన్యం చేశాడని, అసభ్యంగా ప్రవర్తించి దుర్భాషలాడాడని బాధిత మహిళలు వాపోయారు. అతడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Discussion about this post