ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో ఇవాళ ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను విచారించింది. విచారణ ముగియడంతో అధికారులు ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కవిత సీబీఐ కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సీబీఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. విచారణకు కవిత సహకరించలేదని సీబీఐ భావిస్తే.. మరో 3-5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరోసారి కస్టడీకి తీసుకుంటుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. సీబీఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే కవితను మళ్లీ సీబీఐ హెడ్ ఆఫీసుకు తరలించనున్నారు.
Discussion about this post