ఏపీ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఖరారైంది. ఢిల్లీలో అధిష్టానంతో సుదీర్ఘ మంతనాల తర్వాత 114 ఎమ్మెల్యేలను, 5 మంది ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏలూరు ఎంపీగా తాను పోటీ చేస్తున్నట్లు కావూరి లావణ్య ప్రకటించుకున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం తనను ఆమోదించిందని, రెండు రోజులలో అధికారికంగా ప్రకటన వెలువడుతుందని పెర్కొన్నారు.
Discussion about this post