వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయించింది. కడియం కావ్య ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు.
కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ.. ఆమె బీఆర్ఎస్ టికెట్ ను తిరస్కరించి, కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను పెండింగ్ లో ఉంచిన కాంగ్రెస్.. నిన్న ఓ సెగ్మెంట్ కు అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక మూడు ఎంపీ స్థానాలు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ కు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Discussion about this post