కేసీఆర్ పీఛే ముడ్ అంటే వెనక్కి తిరిగారు… బీఆర్ ఎస్ వద్దు.. టీఆర్ ఎస్ నే ముద్దు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ ఎస్ ను .. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత అధికారం కోల్పోవడంతోపాటు, పేరు-ప్రతిష్టలు కోల్పోవడంతో కేసీఆర్ సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఆయన మళ్లీ తన పార్టీని టీఆర్ ఎస్ గా మార్చడానికి ఉన్న చట్టబద్దమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పుట్టుక కోసం ఆవిర్బవించిన టీఆర్ఎస్ ను భారత రాష్ట్రీయ సమితిగా మార్చి దేశరాజకీయాలను కూడా శాసించాలనుకుంది. అయితే కథ అడ్డంతిరిగి ఆ పార్టీ రాష్ట్రంలోనే అధికారం కోల్పోవడం, ఎన్నికల కమిషన్ దాన్ని రాష్ట్రీయ పార్టీగా మాత్రమే గుర్తించడంతో తత్వం బోధపడింది. ప్రస్తుతం మునుపటి టీఆర్ ఎస్ ను మళ్లీ చట్టబద్దంగా తీసుకు రావడానికి కేసీఆర్ లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడే పేరు మారే అవకాశం లేదు.. కనీసం పార్లమెంటు ఎన్నికలన్నా అవ్వాల్సిందే.
Discussion about this post