కార్యక్రమానికి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి…కామారెడ్డిలో ఓడిపోయి గజ్వేల్ నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై గెలుపొందారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ శాసనసభ్యుడిగా ఎన్నికవడం ఇది మూడోసారి. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్‌కు ప్రమాదంలో తుంటి ఎముక విరిగిపోయి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తుంటికి ఆపరేషన్ జరగడంతో వైద్యుల సలహా మేరకు గత కొంత కాలంగా నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలే కోలుకున్న కేసీఆర్ ఈరోజు కర్ర సాయంతో అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశారు.
Discussion about this post