పంట పొలాలను పరిశీలించేందుకకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రంలో సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ రైతులను కలవనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు.
Discussion about this post