ఎక్సైజ్ పాలసీ కేసు లో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అమాయకులని ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. జైలు నుంచే ఆప్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు కాగా, ఇదే కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్ రెండురోజుల క్రితమే బెయిలుపై విడుదలయ్యారు.కేజ్రీవాల్‌పై కేసుకు సంబంధించి మాట్లాడుతూ, ఈడీ, సీబీఐలు మొత్తం 456 సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డు చేశాయని, కేవలం నలుగురే సీఎం పేరును ప్రస్తావించారన్నారు. కేజ్రీవాల్ నీతివంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి అని, పిల్లలకు ఉత్తమ విద్య, ఢిల్లీ ప్రజలకు చక్కటి ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే ఆయన లక్ష్యమని చెప్పారు.
Discussion about this post