ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను వచ్చే సోమవారం పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్‌కు తెలిపారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ మార్చి 21న కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, తన లాయర్లను కలిసేందుకు వారానికి ఐదుసార్లు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇప్పుడున్న ప్రకారం వారానికి రెండు సార్లు మాత్రమే కేజ్రీవాల్ తన లాయర్లను కలవొచ్చు.కాగా ఆప్ మంత్రి రాజ్‌కుమార్ మంత్రి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
Discussion about this post