ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై కోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తీరును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా తప్పుబడుతూ.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే.. అరెస్టు చేయొద్దా? ముఖ్యమంత్రికి ప్రత్యేక హక్కులేమీ ఉండవు. లోక్‌సభ ఎన్నికల సమయాన్ని బట్టి.. ఆయన అరెస్టు గురించి కోర్టు పట్టించుకోదు. చట్టం, న్యాయం ప్రకారమే రిమాండ్‌ను పరిశీలిస్తాం. న్యాయమూర్తులుగా మేము చట్టానికి కట్టుబడి ఉంటాం. మా తీర్పులు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి. అంతేతప్ప.. రాజకీయాలతో మాకు పనిలేదు. మా తీర్పులు రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా ఉండవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Discussion about this post