తీహార్ జైలులో తొలిరోజు ఏప్రిల్ 1 రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అతి కష్టంగా గడిపినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనకు తీహార్ జైలులోని ప్రిజన్ నెంబర్ 2ను కేటాయించారు.అయితే జైలులో తొలి రోజు కేజ్రీవాల్ సరిగా నిద్రపోలేదని జైలు అధికారులు తెలిపారు. రాత్రి కొద్దిసేపు మాత్రమే కేజ్రీవాల్ నిద్రపోయారన్నారు. కేజ్రీవాల్‌కు సాయంత్రం టీ ఇచ్చామని, రాత్రికి ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని కేజ్రీవాల్‌కు వడ్డించామని జైలు అధికారులు చెప్పారు. కేజ్రీవాల్ నిద్రపోయేందుకుగాను పరుపు, రెండు దిండ్లు, బ్లాంకెట్లు ఇచ్చారు. జైలులో తొలిరోజు సరిగా నిద్ర లేకపోవడం వల్ల కేజ్రీవాల షుగర్ లెవెల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయని, డాక్టర్ల సూచన మేరకు ఆయనకు మందులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. జైలులోని డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post