రాష్ట్రంలోని పేదలు, కార్మికులంతా గో బ్యాక్ బాబు నినాదంతో చంద్రబాబును తన సొంత తెలంగాణ రాష్ట్రానికి తరిమికొట్టాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయవాడ గవర్నర్‌పేట బీసెంట్ రోడ్డులో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డితో కలిసి విజయవాడలో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. లెనిన్ సెంటర్, బీసెంట్ రోడ్డులోని వస్త్ర, బంగారు దుకాణాలతో పాటు ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి వివరాలున్న కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో పేదలు, కార్మికులు, కర్షకులు చంద్రబాబు అండ్‌కోను బంగాళఖాతంలో కలిపేయాలని సూచించారు.
Discussion about this post