పాలక వర్గాలు, రాజకీయ నేతల జోక్యంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని రిటైర్డ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్… తొమ్మిదవ మహాసభలు ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని, లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్ లో ఉండటం శ్రేయస్కరం కాదని… త్వరితగతిన తీర్పులు రావడం ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించే వారికి మేలు జరుగుతుందన్నారు.






















Discussion about this post