ఖమ్మం న్యూస్ : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈవో అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
Discussion about this post