ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్స్ సమస్యలపైన అధ్యయన యాత్రలు నిర్వహిస్తున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ తెలిపారు. సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయని , పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు 2500 రూపాయలకు పెంచాలని, పాకెట్ మనీ 1000 రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, ప్రస్తుతం ఉన్న మెనూను సక్రమంగా అమలు చేసి విద్యార్థులకు సరైన పోషకాహారాన్ని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్లో సురక్షిత మంచినీటి సౌకర్యం లేదని, నల్లా నీళ్లు తాగుతున్నారని అన్నారు. దోమల నివారణకు దోమ తెరలు, కిటికీలకు జాలీలు లేకపోవడంతో దోమలు విపరీతంగా కుడుతున్నాయని విద్యార్దులు సర్వేలో వాపోయారు. గదులు కురుస్తున్నాయని, బాలికల హాస్టల్ లోని గదులలో కరంటు షాక్ కు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు తెలిపారు.
Discussion about this post