ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి శ్రుతి ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించింది. ఇంటర్ వరకు గురుకులంలో చదివిన శ్రుతి ఓయులో ఉన్నత విద్య పూర్తిచేశారు.
ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొలపుడి శ్రుతి తండ్రి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా… తల్లి పోలీస్ శిక్షణ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. ఒకే సారి ఎక్సైజ్ కానిస్టేబుల్, గురుకుల స్కూల్ లైబ్రేరియన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఈఓ తో పాటు గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్, TSPSC జేఎల్ లైబ్రేరియన్‌గా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించిన శ్రుతిని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్తో పాటు పలువురు అధికారులు అభినందించారు.
Discussion about this post