ఖమ్మంలో చోరీకి గురైన లారీని ఖమ్మం సీసీఎస్, త్రీటౌన్ పోలీసులు పట్టుకున్నట్లు ఖమ్మం ఏసీపీ హరికృష్ణ తెలిపారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద లారీని పట్టుకున్నట్లు తెలిపారు. లారీ యజమానులు పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కేసును ఛేదించిన సీసీఎస్, త్రీటౌన్ పోలీసులను ఏసీపీ అభినందించారు.
Discussion about this post