ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండా గ్రామపంచాయతీ పరిధిలో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ టవర్స్ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. టవర్స్ నిర్మాణంతో వయోవృద్ధులకి, పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తక్షణమే టవర్ ను తొలగించాలని అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించామని చెప్పారు.
Discussion about this post