ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి..ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వడగాడ్పులు కొనసాగుతాయని, ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరన శాఖ అధికారులు చెప్తున్నారు. మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, సతుపల్లి నియోజకవర్గాల్లోని బొగ్గు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సింగరేణి కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబందించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు.
Discussion about this post