కిడ్నీసమస్యలు అంటే వెంటనే గుర్తుకు వచ్చే ప్రాంతం ఉద్దానం… అచ్చం ఆలాంటి ప్రాంతమే అనకాపల్లి జిల్లాలో మరొకటి ఉంది. అదొక చిన్నగ్రామం .. దాని పేరు మొండిపాలెం … 150 కుటుంబాలు ఉండే ఈ ఊరు ఒకప్పుడు పచ్చని పల్లె గా కళకళ లాడుతూ ఉండేది ..కానీ నీరు కలుషితం కావడంతో ఆ ఊరి ప్రజలు కిడ్నీ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదుకునే నాధుడు లేక అల్లాడిపోతున్నారు.ప్రతి ఇంటిలో పెద్దదిక్కు లేక ఎదిగి వచ్చిన కొడుకులు కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారు.. ఆ గ్రామ ప్రజల గుండె కోత అంతా ఇంతా కాదు. గ్రామాన్ని తరలిస్తానన్న నాయకులు ముఖం చాటేసారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ఈ నేపథ్యంలో మొండిపాలెం గ్రామ ప్రజలకు చావే శరణ్యమా ?.. మొండిపాలెం ప్రజల ఇబ్బందులపై మా ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి షణ్ముఖ గ్రౌండ్ రిపోర్ట్
కిడ్నీ వ్యాధులతో దాదాపు యాట 30 మంది మృత్యువాత పడుతున్న మొండిపాలెం గ్రామం వైపు పాలకులు కన్నెత్తి చూడటం లేదు.. చుట్టూ క్వారీలు క్రషర్లు పెరగటంతో ఊర్లో నీరు కలుషితం కావడం.. దుమ్ము ధూళి ఆవహించటంతో కిడ్నీ సమస్యలు వారిని వెంటాడుతున్నాయి.. ఎన్నికల సమయంలో గ్రామాన్ని తరలించి .. పునరావాసం కల్పిస్తానన్న నేతల హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. చావలేక జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్న పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఊరు ఊరంతా మరణ మృదంగం మోగుతున్నా .. అధికారుల చెవులకి మాత్రం వినిపించడం లేదు .. ఒకప్పుడు పిల్లాపాపలతో పాడిపంటలతో కళకళలాడిన గ్రామం ఇప్పుడు వల్లకాడు లా మారబోతోంది.. గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నా కరుణించే నాధుడే కరువయ్యాడు.. మొండిపాలెం గ్రామవాసులు ప్రాణాలు అరచేత పెట్టుకొని బ్రతకడానికి మార్గాలు వెతుక్కుంటున్నదుస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత ఊరుని వదల లేక మరో దారి లేక అక్కడే కాలం వెళ్ళదీస్తున్నారు.
మరోవైపు ప్రజలను కాపాడవలసిన ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి కిడ్నీ వ్యాధులకు కలుషిత నీరు అతి కాలుష్యమే కారణమని నిపుణులు తేల్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు .. ఊరు ఊరంతా ఒకే మంచినీటి కొళాయిపై ఆధారపడి కాలాన్ని వెళ్లదీస్తున్నా .. అధికారులలో చలనం రావడం లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా రోదనలు ఎప్పుడు వినిపిస్తాయి అని మొండిపాలెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా చొరవ తీసుకొని పునరావాసం లేదంటే ఊరిలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మొండిపాలెం గ్రామస్తులు కోరుతున్నారు.
Discussion about this post