ఉత్తరాంధ్ర లో రోగులకు విశేష సేవలు అందిస్తున్న విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ మరింత మెరుగైన సేవలు అందించనున్నామని ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ పి.శివనంద పేర్కొన్నారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ లో కమాండ్ కమ్యూనికేషన్ టోల్ ఫ్రీ సెంటర్ ను సూపరిండెంట్ శివనంద ప్రారంభించారు.గత కొంత కాలంగా కేజీహెచ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రోగుల సౌకర్యార్థం ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రి ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ఆన్లైన్ ఓపి విభాగంలో సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
Discussion about this post