టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ముందే టీమిండియాకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సర్జరీ చేయించుకున్న కారణంగా భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఈ మెగాటోర్నీకి దూరమవ్వగా… తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం ఈ టోర్నీకి దూరం కానున్నాడు.
టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ 2024కు దూరం కానున్నాడు. కోహ్లీని ఈ పొట్టి టోర్నీకి దూరంగా పెట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి బీసీసీఐ ఓ బలమైన కారణాన్ని వెల్లడించింది. జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరగనుండగా… వెస్టిండీస్ లో స్లో పిచ్ లు ఉంటాయని, దానికి కోహ్లీ సూట్ కాడని బీసీసీఐ వాదిస్తోంది. ఈ కారణంతోనే అతడిని ఈ మెగాటోర్నీ నుంచి తప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతలను అజిత్ అగార్కర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ బౌలర్ మహ్మద్ షమీ దూరం కాగా.. ఇప్పుడు కోహ్లీ కూడా దూరమైతే.. టీమిండియాకు కష్టాలు తప్పవని అభిమానులతో పాటుగా క్రీడా వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. అదీకాక యంగ్ స్టర్లకు అవకాశాలు ఇవ్వాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Discussion about this post