రైతుబజార్లను దళారీల పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన నగరంలోని రైతు బజారును సందర్శించారు. వ్యాపారాలు సాగిస్తున్న రైతుల్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ… రైతులు పండించిన కూరగాయలు, ఆకు కూరలను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునేందుకు 25 యేళ్ల క్రితం నారా చంద్రబాబు నాయుడు రైతు బజార్లను తీసుకొచ్చారన్నారు. రైతులకు అతి తక్కువ ధరకు రైతు బజార్లలో స్టాల్స్ కేటాయించి వారిని ప్రోత్సహించామన్నారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతుబజార్లను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
Discussion about this post