ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై… కృష్ణా జలాలను ఏపీకి దారాదత్తం చెయ్యడమే కాకుండా, నల్లగొండలో సభ పెట్టడం విడ్డూరంగా వుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అప్పటి ఇరుగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు…మునిగిపోయే ప్రాజెక్టులు కట్టాడని అన్నారు. కేటిఆర్ కి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు… ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు దండుకున్న కేసీఆర్…నల్లగొండకు ఎలా వస్తావో చూస్తా అన్నారు.
Discussion about this post