బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కామాక్షితాయి ఆలయం ముందు టెంకాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, స్థానిక నాయకులు ఆయనతో ఉన్నారు. జొన్నవాడ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపామని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి గా ఉన్న ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చైర్పర్సన్ మోర్ల సుప్రజమురళి, కౌన్సిలర్ షకీలా బేగం, కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Discussion about this post