నిజంగా ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR Arrest …?
ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకోండి అని ప్రభుత్వానికి సవాల్ విరుసుతున్నారు.KTR Arrest. ఆయన తరచూ అరెస్టు సవాల్ చేయడం పట్ల తెలంగాణ రాజకీయాల్లో రకరకాలగా చర్చ జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను అరెస్టు చేస్తుందా…? ఆ విషయం తెలిసే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారా…? అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా మరోసారి అదే విధమైన కామెంట్ చేశారు కేటీఆర్. ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్టు చేస్తారని ఎప్పుడో తెలుసు… రైతుల గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలు కెళ్తా… కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు.. అరెస్ట్ చేస్కో రేవంత్రెడ్డి… అని సవాల్ విసిరారు కేటీఆర్. KTR Arrest …?
ఫార్ములా వన్ రేసు కోర్సుకు సంబంధించిన అంశంలోనూ కేటీఆర్ అరెస్టు తప్పదన్న వార్తలు వచ్చాయి
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై రైతుల దాడికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు అయ్యారు. దాడికి సంబంధించి కుట్ర చేశారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేయడంతో ఆ కేసులో కేటీఆర్ పాత్ర కూడా ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అందుకే తనపై కేసులు పెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించిన కేటీఆర్… అరెస్టు చేసుకోవచ్చని సీఎంకు సూచించారు. అయితే తనను అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రకటించడం ఇది మొదటి సారి కాదు. ఇటీవలి కాలంలో ఆయన తరచూ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఫార్ములా వన్ రేసు కోర్సుకు సంబంధించిన అంశంలోనూ కేటీఆర్ అరెస్టు తప్పదన్న వార్తలు వచ్చాయి. KTR Arrest …?
కేటీఆర్ ఢిల్లీ పర్యటలకు వెళ్లడంతో ఆయనపైన ప్రత్యర్థులు రాజకీయ విమర్శలు చేశారు.
అరెస్టు వార్తలు బయటికి వచ్చిన సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటలకు వెళ్లడంతో ఆయనపైన ప్రత్యర్థులు రాజకీయ విమర్శలు చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం తెరపైకి తెచ్చారు. అయితే ఈ ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. అంతకు ముందు కూడా దన్వాడ లోని ఫామ్ హౌజ్ పై పోలీసులు దాడులు చేసిన సమయంలోనూ కేటీఆర్ లక్ష్యంగానే తనిఖీలు జరిగినట్లు… ఆయన్ను అరెస్టు చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇలా ప్రతి విషయంలోనూ కేటీఆర్ అరెస్టు కాబోతున్నారంటూ ప్రచారం జరగడం… దాన్ని ఆయన ఖండిస్తూ రావడం చూస్తూ వచ్చాం. కానీ ఇటీవల కొంత కాలంగా కేటీఆర్ స్వరంలో మార్పు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేసులకు భయపడేది లేదని చెప్పడం… అన్నింటికి పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలంటూ సూచించడం… కేటీఆరే స్వయంగా అరెస్టు అంశాన్ని నిర్థారించినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అధికార కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నట్లు కేటీఆర్ అరెస్టు జరుగుతుందా? అరెస్టులను ముందుగానే ఊహించి కేటీఆర్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా ? KTR Arrest …?
మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ను సందర్శించండి : 4Sides Tv.
Discussion about this post