ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఉండనున్నారు. కవితను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కవితకు మద్దతుగా, ఈడీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ సామ్ లో అరెస్ట్ అయిన కవితను సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కలిసే అవకాశం ఉంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమయం కేటాయించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ తో సహా హరీష్ రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశాలు వున్నాయి. కాగా.. తాజాగా ఈడీ ఆమె భర్త అనిల్‌కు నోటీసులు పంపింది. సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.
Discussion about this post