ఖమ్మం లోక్ సభ స్థానం కాంగ్రెస్ టికెట్ రేసులో తాను కూడా ఉన్నానని, పార్టీతో ఉన్న 37 ఏళ్ల అనుబంధాన్ని, పార్టీకి అందించిన సేవలను గుర్తించి అధిష్టానం టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన తనకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధుల మద్దతు ఉందని వివరించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. ఎవరికి టికెట్ ఇచ్చినా అయిదు లక్షలకుపైగా మెజారిటీతో గెలుస్తామని చెప్పారు.
Discussion about this post