హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని దామరచెరువును మినీ ట్యాంక్ బండ్ పేరుతో 2016లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో…రెండు కోట్ల రూపాయలతో మొదలైన పనులు ప్రస్తుతం నాలుగున్నర కోట్లకు చేరింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటికి పూర్తవ్వలేదు. చెరువులోని మట్టిని పరకాలతో పాటు ఇతర గ్రామాలకు అమ్ముకున్నారు. పనులపైన ప్రశించిన వారి ఇళ్లపైన దాడులకు తెగబడ్డ చరిత్ర చల్లా ధర్మారెడ్డిదని గ్రామస్తులు వాపోతున్నారు.. ప్రతిసారి ఎన్నికలప్పుడు తమ ఎజెండాలో మినీ ట్యాంక్ బండ్ చేర్చడం తప్ప అభివృద్దికి నోచుకోలేదని, దసరా పండుగకు ముందు టూరిజం పడవని తీసుకువచ్చి ఆర్భాటాలు చేసినప్పటికీ…దాన్ని ఉపయోగంలోకి తేలేదని గ్రామస్తులు చెప్తున్నారు. లక్షల రూపాయల ప్రజల సొమ్మును బురదలో పోసినట్టేనని అంటున్నారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post