యువత పార్లమెంటరీ వ్యవహారాలు, శాసన నిర్మాణ ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి.. వినూత్న భారతాన్ని అవిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. భారత ప్రభుత్వ యువజన కేంద్ర సర్వసులు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ‘నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్’ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ మహిళా డిగ్రీకళాశాలలో నిర్వహించారు. ప్రిన్సిపాల్ కెప్టెన్. డా॥ విజయ్ కుమార్ మాట్లాడుతూ మన యువత దేశ అభివృద్దిని, అభ్యున్నతిని ఆకాక్షించే విధంగా మున్ముందు అనేక కార్యక్రమాలు రూపొందేలా.. తమవంతు కృషిని చేస్తామన్నారు.
Discussion about this post