నిజామాబాద్ లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నాగారం డంపింగ్ యార్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ బండరాయిపై చిరుతను గుర్తించిన స్థానికులు ఫొటో, వీడియోలు తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు సంప్రదించగా చిరుత సంచారం నిజమేనని ఫారెస్ట్ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్ తెలిపారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. అడవి ప్రాంతం వైపు వెళ్లువారు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరగరదని పేర్కొన్నారు.
Discussion about this post