రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పడిన కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి అభ్యర్థి ని గెలిపించాలని తెదేపా నాయకులకు, జనసేన శ్రేణులకు రెడ్డి అప్పల నాయుడు, కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు.
ఏలూరు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమితో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఇరు పార్టీల నాయకులకు తెలిపారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించేందుకు తెదేపా భాజపా జనసేన కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఏలూరు నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలా ఉమ్మడి లక్ష్యం వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దించడమేనని స్పష్టం చేశారు.
Discussion about this post