ఖమ్మం జిల్లాలో పురాతన గ్రంధాలయ భవనం కూలిపోయింది. ప్రతీ రోజు సుమారు వందల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటారు. వీరితో పాటు నగరవాసులు కూడా అనునిత్యం పత్రికలు చదివేందుకు వస్తుంటారు. శుక్రవారం సెలవు కావడంతో ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. ఉద్యోగాలు రాక పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుపేద విద్యార్థుల జీవితాలతో అధికారులు ఆడుకుంటున్నారని నిరుద్యోగులు వాపోతున్నారు. లైబ్రరీని వేరొక భవనానికి మార్చాలని గతంలో అధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Discussion about this post