న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్ ఐసీ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో తమ కార్యాలయం ముందు నిరసన తెలియచేశారు. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు. 2022లోనే వేతన సవరణ జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు జరగలేదని, ఈ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుగచేసుకోవాలని లేఖ రాశామన్నారు. తాము కష్టపడి పని చేస్తే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరపాలని ఉద్యోగులు డిమాండు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులంతా ఓకే యూనియన్ గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు.
Discussion about this post