తన జీవితం అంతా ఉద్యోగంతో బిజీగా గడిపిన 75 ఏళ్ల మహిళ రెండేళ్లుగా రేయింబవళ్లు ఎడతెరిపిలేని దగ్గుతో బాధపడుతోంది. ఎంత మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దగ్గుకారణంగా తన వెన్ను ఆపరేషన్ వాయిదా పడింది. కొన్ని సార్లు దగ్గుతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. డాక్టర్లు ఎన్ని మందులు వాడినా ఎన్ని టెస్టులు చేసినా ఆ మహిళ బాధ నివారణ జరగడం లేదు. అలా రెండేళ్లు గడిచి పోతుండగా, ఒకరోజు తను తీయించుకున్న ఎక్స్ రే ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. ఊపిరితిత్తుల్లో తేడా ఉంది. వెంటనే డాక్టర్ ను కలవండి అని వారు చెప్పారు. వారు చెబుతున్నది వింటున్న ఆమెకు గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే కుర్చీలో కూలబడింది .. అసలు ఏం జరిగిందో తెలుసా ?
న్యూయార్క్ సిటీ ని కోవిద్ 19 పాండమిక్ చుట్టుముట్టడంతో ఆమె మన్ హట్టన్ నుంచి ఒక మారు మూల గ్రామానికి వచ్చింది. వచ్చిన కొన్ని వారాలలో ఆమెకు దగ్గు సమస్య వచ్చింది. ఆసుపత్రులన్నీ కోవిద్ పేషంట్లతో నిండి ఉన్నాయి. ఆసమయంలో ఈమెకు ట్రీట్ మెంట్ ఇచ్చే వారే కరువయ్యారు. ఒకసారి పీహెచ్ కు వెళ్లారు. ఆమెకు కోవిద్ టెస్ట్ , X-ray తీశారు. రెండూ నార్మల్ గానే ఉన్నాయి. దీంతో బెడ్ పై పిల్లోను మార్చాల్సిందిగా డాక్టర్ కోరారు. వాటివల్ల ఎలర్జీ తో దగ్గువస్తుందన్న అనుమానంతో ఆ డాక్టర్ ఆ సజెషన్ ఇచ్చారు. అయినప్పటికీ దగ్గు ఏమాత్రం తగ్గలేదు. ఇదివరలో ఆమె తన పెంపుడు కుక్కతో వాకింగ్ కు వెళుతుండేది. ఇప్పుడు రెండు అడుగులు కూడా వేయలేకపోతోంది. గాలి పీల్చడం కూడా ఇబ్బందిగా మారింది. తన సమస్యపై ఇంటర్నెట్ లో చాలా వెతికింది అయినా లాభం లేకుండా పోయింది. ఇదే సమయంలో తాను 20 పౌండ్ల బరువు తగ్గిందని తెలిసి బాధపడింది. ఆ సమయంలో X-ray రిపోర్టు వచ్చింది. వెంటనే డాక్టర్ కలవాలని, సీటీ స్కాన్ చేయించుకోవాలని కోరారు. డాక్టర్ ను కలసిన తర్వాత ఆమెకు తెలిసిందేమంటే ఇంటర్ స్టీషియల్ లంగ్ డిసీజ్, ఇడియోపాతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడిందన్నారు. దీంతో మరణానికి చేరువయ్యే అవకాశాలున్నట్లు డాక్టర్లు ఆమెకు చెప్పారు.
Discussion about this post