ఖమ్మంలో పలు రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. దారి పొడవునా గుంతలు, కంకర తేలడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే ఈ రోడ్లు అస్తవ్యస్థంగా మారుతున్నాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంపై నగరవాసులు మునిసిపల్ కార్పొరేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డ్రైనేజీలు మురికి నీరుతో పూర్తిగా నిండి దురువాసన వస్తుంది. దీంతో డెంగు, మలేరియా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
Discussion about this post