సార్వత్రిక ఎన్నికల వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దాదాపు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. కాగా, శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సొంత ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు పల్లె బాట పడుతున్నారు. వరుస సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్ లో ఉండే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారు ఓటేసేందుకు ఎలక్షన్ జర్నీకి సిద్ధం అయ్యారు. మే 13న పోలింగ్ ఉండగా.. 11న రెండో శనివారం, 12న ఆదివారం సెలవు ఉండటంతో ముందుగానే సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం నుంచే ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలివెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో పండుగల సీజన్ లాగే ప్రయాణికుల కోసం స్పెషల్ సర్వీసులు సిద్ధం చేసింది ఆర్టీసీ. అలాగే, దక్షిణ మధ్య రైల్వే కూడా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతంతో పోల్చుకుంటే ఈసారి ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, జిల్లాలో ఉండే వారు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే అవకాశం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సాధారణంగా పండుగల సీజన్ లో నడిపే సర్వీసుల మాదిరిగా ఎలక్షన్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు, బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post