కాకినాడ వైసీపీ : ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగ గీతను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పంపాలని నిర్ణయించిన వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేసింది. ఎంపీలుగా వెళ్లాలని కొందరు నేతలను పిలిచి ఒత్తిడి తెచ్చినా.. వారంతా ససేమిరా అనడంతో విస్తుపోయారు. చివరకు చలమలశెట్టి సునీల్‌పై భారం మోపారు.
కాకినాడ ఎంపీ సీటు నుంచి మూడుసార్లు వివిధ పార్టీల నుంచి పోటీ చేసినా కలిసి రాకపోవడంతో ఇక ఎంపీ బరిలోకి దిగేందుకు ఆసక్తి లేదని సునీల్ మొదటి నుంచి చెబుతున్నారు. నిజానికి కాకినాడ నుంచి ఎంపీగా గెలవాలనే పట్టుదలతో సునీల్ హైదరాబాద్ నుంచి వచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వరుసగా మూడుసార్లు ఓడిపోవడంతో ఇకపై కాకినాడ నుంచి బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నాడు.
Discussion about this post