పెట్రోలు పంపులు : నిజామాబాద్ జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద స్టాక్‌తో వాహనదారుల రద్దీ పెరిగింది. పెట్రోలు ట్యాంకర్ల యజమానుల సమ్మె కారణంగా ఈ సమస్య తలెత్తింది. కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగుతారని, తద్వారా పెట్రోల్ బంకులను మూసివేస్తారని పుకార్లు వ్యాపించాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులంతా క్యూ కట్టడంతో గందరగోళం నెలకొంది.
Discussion about this post