రూ.15 లక్షల విలువైన 560 గ్రాముల డ్రగ్ స్వాధీనం
ప్రశాంతంగా ఉండే నెల్లూరులో ఓ ముఠా మాదక ద్రవ్యాల తయారీ సాగిస్తోందని వెల్లడవటం అలజడి సృష్టించింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి డ్రగ్స్ దందాకు బ్రేక్ వేశారు. నెల్లూరు శివారు ధనలక్ష్మీపురంలోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి డ్రగ్స్ తయారీ పరికరాలు, గంజాయి, దాదాపు 15 లక్షల రూపాయల విలువ చేసి ఆంఫటమిన్ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. బీటెక్ చదివిన ఓ యువకుడు యూట్యూబ్ లో డ్రగ్ తయారీ విధానం తెలుసుకుని మరి కొందరితో కలిసి ఈ దందాకు పాల్పడ్డాడని వివరించారు.
Discussion about this post