మహబూబ్ నగర్ : దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులకు సీడబ్ల్యూసీ ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ…రాష్ట్రంలో 10 ఏళ్లుగా, నియోజకవర్గంలో 15 ఏళ్లుగా అధికారం లేకపోయినా… అక్రమ కేసులతో బెదిరించినా.. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. పార్టీపై నమ్మకం ఉంది. కార్యకర్తల కృషి వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని కోరారు.
Discussion about this post