జిల్లాలో మాదకద్రవ్యాలను అక్రమరవాణా చేసినా, వినియోగించినా కఠినంగా శిక్షిస్తామని మహబూబ్ నగర్ జిల్లా డిఎస్పి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వివిధ కళాశాలలో, గ్రామీణ ప్రాంతాల్లో మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు. గతంలో జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాదకద్రవ్యాల కేసులు నమోదయ్యాయని, వారిపై చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదన్నారు.
Discussion about this post