పాలమూరు యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం పీఎం ఉష స్కీమ్ ద్వారా 100 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమని విసి లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఈ నిధులను రిపేర్ సెంటర్ కోసం వెచ్చిస్తామన్నారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల కోసం ప్రతిపాదన పంపామని వాటిని నిర్మించేందుకు భూమి కేటాయించాలని కోరారు.పీయు అభివృద్ధి కోసం రాజకీయాలు, భేషజాలు లేకుండా పని చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Discussion about this post