రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే నేటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. అందుకు అనుగుణంగానే నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని క్రిష్ణా పుష్కర ఘట్ దగ్గర… కృష్ణమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపి విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ఐదు క్లస్టర్లలో 17 లోకసభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు 4,238 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. నారాయణపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. నారాయణ పేట జిల్లా కృష్ణా నదిలో పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా గ్రామంలో విజయసంకల్ప యాత్రను ప్రారంభిచారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో మూడు రోజుల పాటు యాత్ర సాగనున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్లలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,440 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.
Discussion about this post