జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన వెంకట మహేశ్ మరోసారి విమర్శలు చేశారు. మీడియాలో పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడే ఆయన ఈసారి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. తనపై జనసేన చంచాలు అరిచే బదులు పార్టీ వీడుతున్న వారిని కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. ఈసారైనా విజిటర్స్ పాస్ లేకుండా అసెంబ్లీలోకి వెళ్లే పని చూడాలని పవన్ కు పోతిన మహేశ్ హితవు పలికారు.
జనసేన పార్టీలో పని చేసిన పోతిన మహేశ్ విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే కూటమిలో భాగంగా ఆయనకు జనసేన టికెట్ దక్కలేదు. దీంతో మనస్థాపం చెందని పోతిన మహేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి పవన్ కల్యాణ్‌పై ప్రతి రోజు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
Discussion about this post