హరీష్ రావు, కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టేదాక నిద్రపోనని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని చీమలు పెట్టిన పుట్టలో చేరారంటున్నారు కాని.. కేకే మహేందర్ రెడ్డి పెట్టిన పుట్టలో కేటీఆర్ చేరారని మైనంపల్లి విమర్శించారు. మా కార్యకర్తలకు ఏమైనా అయితే హరీష్ రావు పై దాడి చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు రియల్ హీరో అని కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ తెలిపారు. జనం కోసం బ్రతికే టైగర్ మైనంపల్లి అని బండ్ల గణేష్ అన్నారు.
మైనంపల్లి హనుమంతరావుకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయానికి మైనంపల్లి భూమి పూజ చేశారు. మన ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలేదు,అప్పుడే కుట్రలు పన్నుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పులు తప్ప.. ఏమీ చేయలేదని మైనంపల్లి విమర్శించారు.
Discussion about this post