మాజీమంత్రులు ఈటల రాజేందర్, మల్లా రెడ్డి మధ్య ఆసక్తి కర సంభాషణ జరిగింది. ఈటల రాజేందర్ మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఈటల రాజేందర్‌కు మల్లారెడ్డి ఎదురు పడ్డారు. గతంలో వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. ఈటల రాజేందర్ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. లోక్ సభ ఎన్నిక, విజయం గురించి వీరి మధ్య చర్చ వచ్చింది. మల్లారెడ్డి.. నవ్వుతూ.. అన్నా, నువ్వే గెలుస్తావ్ అనడంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా నవ్వారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్‌తో మాటల నేపథ్యంలో బీజేపీలో చేరతారా..? అనే సందేహాం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య జరిగిన చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Discussion about this post